ఢిల్లీలో ఆప్, బిజెపి నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కి వ్యతిరేకంగా బిజెపి ఆందోళనలు చేపట్టింది. మనీష్ సిసోడియాకు లై డిటెక్ట్, నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముందు బిజెపి నేతలు ఆందోళన చేపట్టారు. సిసోడియాపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. సిసోడియా రోజుకో అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం పాలసీ పై అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సిబిఐ అధికారులు మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 13 మందికి కూడా నోటీసులు ఇచ్చింది సిబిఐ. అయితే సోదరుల్లో భాగంగా ఒక పైసా కూడా పట్టుకో లేకపోయారు సిబిఐ అధికారులు. ఆగస్టు 17వ తేదీన నమోదైన ఎఫ్ఐఆర్ లో 15 మందిని నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలోనే సిసోడియా కు లై డిటెక్ట్, నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆందోళనలకు దిగింది.