BREAKING : మోదీపై దాడికి ఉగ్రవాదుల కుట్ర.. రంగంలోకి ఎన్​ఐఏ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నిన వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ముఖ్యంగా నిషేధిత ఇస్లామిక్​ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలే లక్ష్యంగా (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది.

2022లో బిహార్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి యత్నించిన కేసులో కర్ణాటక, కేరళ, బిహార్‌లోని దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించింది. ఇవాళ ఉదయం నుంచే.. దక్షిణ కన్నడ జిల్లాలో సోదాలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పీఎఫ్ఐ కార్యకర్తలకు చెందిన 16 ప్రదేశాల్లో దాడులు చేస్తున్నట్లు వెల్లడించాయి. మంగళూరు, పుత్తూరు, బెల్తాంగడే, ఉప్పినాంగడే, వెనూర్, బంత్వాల్ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పలు డిజిటల్ డాక్యుమెంట్లను ఎన్​ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news