గుడ్ న్యూస్ః లోన్ తీసుకున్న వారికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన ఆర్బీఐ

క‌రోనా క‌ష్ట కాలంలో రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అంద‌రూ ఎదురుచూస్తున్న‌ట్టుగానే మార‌టోరియంపై క్లారిటీ ఇచ్చింది. గ‌తేడాది లాక్ డౌన్ సంద‌ర్భంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి మార‌టోరియం ఇచ్చి ఎంతో మేలు చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫ‌రే ఇచ్చింది.

ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 వెస‌లుబాటును తెచ్చింది. ఈ మేర‌కు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీల‌క అంశాల‌ను వెల్ల‌డించారు. ప‌ర్స‌న‌ల్ లోన్న‌లు, చిన్న త‌ర‌హా బిజినెస్ లోన్లు తీసుకున్న వారు మ‌రో రెండేళ్ల వ‌ర‌కు మార‌టోరియంను వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. రూ.25కోట్ల రుణాల లోపు ఉన్న‌వారికి ఈ సౌల‌భ్యం ఉంటుంది.

అయ‌తే 2021 మార్చి 31 లోపు రుణాలు తీసుకున్న వారికే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. రుణ గ్రహీతల కోసం బ్యాంకులు సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చరింగ్ వెస‌లుబాటును అమ‌లు చేయొచ్చు. గ‌తేడాది మార‌టోరియంను వినియోగించుకున్న వారు, కొత్త‌వారు కూడా దీన్ని పొంద‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.