కాబోయే భర్తని అరెస్టు చేయించిన పోలీస్ అధికారిని..?

-

కాబోయే భర్త ని పోలీస్ అధికారిని అరెస్టు చేయించింది. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ జున్మోని రాభాకు, రానా పోగాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా పరిచయం చేసుకున్న అతడితో గత ఏడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ లో వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. అయితే కాబోయే భర్త మోసగాడు అన్న సంగతి ఎస్ఐ జున్మోనికి ఆ తర్వాత తెలిసింది. ఎన్ఓజిసి లో పనిచేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రానా, పలువురిని మోసగించి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయం ఆ పోలీస్ అధికారి దృష్టికి వచ్చింది.

దీంతో ఆమె ఆలస్యం చేయకుండా కాబోయే భర్త పై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు రానా పోగాగ్ ను గురువారం అరెస్ట్ చేశారు. మరోవైపు తన కళ్లు తెరిపించిన ముగ్గురు వ్యక్తులకు ఎస్ఐ జన్మోని ధన్యవాదాలు తెలిపారు. తనకు కాబోయే భర్త రానా పెద్ద మోసగాడు అన్న సంగతి వారు చెప్పారని మీడియాతో అన్నారు.కాగా ఈ పోలీసు అధికారిని ఈ ఏడాది జనవరిలో వార్తల్లో నిలిచారు. బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భూయాన్ పిలుపు మేరకు చట్ట ఉల్లంఘనకు పాల్పడిన బిజెపి నేతలకు మద్దతు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news