దేశంలోని సామాన్య మరియు ఉన్నత వర్గాలకు చెందిన వినియోగ దారులకు షాక్ తగులనుంది. మనం నిత్యం వినియోగించే ఏసీలు, ఫ్రిడ్జ్ లు, సీలింగ్ ఫ్యాన్ల ధరలు మరోసారి భారీగా పెరుగనున్నాయి. త్వరలో ఏసీల ధరలు 5-8%, ఫ్రిడ్జ్ ల ధరలు 5%, ఫ్యాన్ల ధరలు 7-8% పెరుగుతాయి.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కొత్త నిబంధనలు ఈనెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం వీటి తయారీలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు 4 స్టార్ కు మారుతాయి. ఫైవ్ స్టార్ ప్రమాణాలతో కొత్త పరికరాలు తయారు కానున్నాయి. దీంతో ధరల పెంపునకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఒక వేళ ఏసీలు, ఫ్రిడ్జ్ లు, సీలింగ్ ఫ్యాన్లు తీసుకునే వారు.. ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.