అందుకే.. వైద్య ఆరోగ్య శాఖ ఆ స్టిక్కర్లను షేర్‌ చేయమంది!

భారత్‌లో విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటికే అనేక నిబంధనలు పాటిస్తున్నాం. బయటకు వెళితే తప్పకుండా మాస్కు ధరించడం, సామాజిక దూరం ఎన్నడూ లేని విధంగా ఆచరిస్తున్నారు. అయితే, కేంద్ర కుటుంబ వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ వినూత్న ప్రయోగాలకు తెరతీసింది. భారత పౌరులకు కాపాడుకోవడానికి వారిని ఇంట్లోనే ఉండమని సూచిస్తూ మైక్రో బ్లాగింగ్‌ ట్వీట్టర్‌లో షేర్‌ చేసింది.

వాట్సాప్‌ ద్వారా తమ స్నేహితులకు, కుటుంబీకులకు వ్యాక్సిన్‌ స్టిక్కర్లను కరోనా నిబంధనలు పాటించడానికి అలవాటు పడటానికి షేర్‌ చే యమని సూచిం చింది. నిబంధనలు పాటిస్తే కరోనా మహమ్మారి బారిన పడుకుండా సేఫ్‌గా ఉండవచ్చని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ట్వీట్‌లో కరోనా వ్యాక్సిన్‌ స్టిక్కర్లను వాట్సాప్‌ ద్వారా ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలిపింది. ఇది వరకే వాట్సాప్‌ తమ వినియోగదారుల కోసం ‘వ్యాక్సిన్‌ ఫర్‌ ఆల్‌’ అనే స్టిక్కర్‌ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని షేర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సప్‌ చాట్‌లో ఉన్న స్టిక్కర్లు చాలా ఫన్నీగా ఉన్నాయి. హెల్త్‌ కేర్‌ వర్కర్లను అప్రిషియేట్‌ చేస్తున్న స్టిక్కర్లు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు తొలగించడం, వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగే విధంగా ఉన్నాయి.