బెదిరించి.. 1000 మంది అమ్మాయిలతో శృంగారం.. చివరికీ..!

-

మతం పేరును అడ్డుపెట్టుకొని అమ్మాయిల మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకున్నాడు ఓ వ్యక్తి. అతడు అన్నం తినడం మరిచిపోతాడేమో గానీ.. రోజూ పడక సుఖాన్ని మాత్రం మరిచిపోడు ఆ వ్యక్తి. ఇక రాత్రి పగలు తేడా లేకుండా అదే పనిలో మునిగితేలేవాడు. ఇక ఒకపక్క మత ప్రవచనాల చేస్తూనే మరోపక్క కామక్రీడల్లో మునిగితేలేవాడు. ఉదయం భక్తి.. రాత్రయితే రక్తి.. ఇలా రసికత్వాన్ని నరనరాన్న పట్టించుకున్నాడు. వెయ్యి మందికి పైగా ప్రియురాళ్లతో అతడికి ‘ప్రతి రోజూ పండగే’. అందుకే.. కోర్టు అతడికి 1075 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇతడు డేరా బాబా కాదండోయ్.. అతడికి దాదాపు గురువులాంటోడు.

men

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు అద్నాన్ ఓక్తర్. వయస్సు 64 ఏళ్లు. కానీ ఈ వయస్సులో కూడా అతడు రాత్రయితే ఒంటరిగా పడుకోలేడు. కనీసం పది మంది అమ్మాయిలు తోడుగా పడుకోవల్సిందే. లేకపోతే అతడికి నిద్రపట్టదు. ఆడ స్పర్శ లేకపోతే కనీసం ఆవలింత కూడా రాదు. అందుకే.. వారిని కౌగిలించుకుని మరీ నిద్రపోతాడు.

అంతేకాక అమ్మాయిలను చిత్రహింసలకు గురిచేసేవాడు. బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించేవాడు. అయితే ఫతుల్లా అనే ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు అందించాడు. దీంతో పోలీసులు 2019లో అద్నాన్, వందలాది మంది అనుచరులను అరెస్టు చేశారు. సోదాల్లో వేలాది గర్భస్రావ మాత్రల స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలకు విముక్తి కల్పించారు.

ఇక కోర్టు ముందుకు హాజరైన అద్నాన్.. న్యాయమూర్తికే షాకిచ్చే వివరాలు చెప్పాడు. తనకు వెయ్యి మంది ప్రియురాళ్లు ఉన్నారని తెలిపాడు. ప్రేమకు హద్దు లేదని, అందుకే అంతమందికి పంచిపెట్టానని తెలిపాడు. తాను ఎంతమందినైనా తల్లులను చేయగలనని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నీలాంటివాడికి చిన్న శిక్ష సరిపోదంటూ 1075 ఏళ్లు జైలు శిక్ష విధించాడు. అమ్మాయిలను మోసం చేయడం, సెక్స్ నేరాలు, దేశ ద్రోహం, ఆర్థిక నేరాలు తదితర కేసుల్లో అతడికి ఈ శిక్ష పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version