తమిళ నటుడు విజయ్… రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. నేడు నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. విల్లు పురంలోని విక్రవండిలో సభకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ తొలి మహానాడుకు ఐదు లక్షల మంది సరిపడేలా ఏర్పాట్లు చేశారట నేతలు. తొలి బహిరంగ సభలో పార్టీ జెండా ఆవిష్కరణ..ప్రధాన ఆకర్షణగా నిలవనుందట.
జెండాలో పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులున్నాయి. సామాజిక న్యాయం,ఏకత్వం,అభివృద్ధిలకు సూచనగా ఈ రంగులు ఏర్పాటు చేశారట హీరో విజయ్. ఇక ఈ తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి బహిరంగ సభలో ఒక గంటపాటు ప్రసంగించనున్నారు విజయ్. తమిళ ప్రాబల్యం, దేశభక్తి,సుస్థిరత అంశాలతో పాటు ద్రవిడ విలువలు, సమకాలీన సమస్యలు సహా వైద్యం,విద్యా సంస్కరణలకు టీవీకే పార్టీ ఒక వారధిలా నిలుస్తుందనే సంకేతాలు పంపనున్నారట హీరో విజయ్. వేదికను పెరియార్, కె కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కటౌట్లను ఉంచుతూ ద్రవిడ సిద్ధాంతాలను పాటిస్తూనే సరికొత్త రాజకీయాలకు బాటలు వేయనున్నారట.