Bihar : మరోసారి గంగానదిపై కూలిన తీగల వంతెన.. ఇది మూడోసారి

-

బీహార్‌ లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాదాపుగా 12 బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వంతెన కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా రూపొందుతున్న గంగానదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఓవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన ఇప్పటికీ మూడో సారి కూలిపోయింది.

నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో.. పూర్తయినా ఎంత కాలం నిలుస్తుందోనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు వంతెన కూలిన ఘటనపై ప్రాజెక్టు బాధ్యత వహించే నిర్మాణ సంస్థ ఎస్‌కే సింగ్లా కన్స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news