గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు కి చేదు అనుభవం ఎదురైంది. జూపల్లి గో బ్యాక్ అంటూ సొంత పార్టీ శ్రేణులే నిరసన వ్యక్తం చేసారు. గద్వాలకు వచ్చిన జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ ని అడ్డగించారు పార్టీ శ్రేణులు. అయితే ప్రాజెక్ట్ ల పర్యటన కోసం గద్వాల వెళ్లారు మంత్రి. కానీ ఆయనను సొంత పార్టీ కి చెందిన సరిత వర్గం అడ్డుకుంది.
గద్వాల ఎమ్మెల్యే ను పార్టీలో చేర్చుకొని.. తమ నాయకురాలు సరిత ను జూపల్లి కృష్ణారావు రాజకీయంగా డిస్ట్రబ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు శ్రేణులు. అయితే మంత్రి కాన్వాయ్ కి అడ్డుపడిన వారిని పోలీస్ లు చేదరగొట్టారు. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని రోజులుగా గద్వాల లోని సరిత వర్గం మంత్రి జూపల్లి కృష్ణారావు పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఆయన గద్వాల పర్యాటకు రావడంతో కాన్వాయ్ ని ఆడుకొని తమ నిరసన వ్యక్తం చేసారు.