వాహనదారులకు ఒకే రకమైన పొల్యూషన్ సర్టిఫికెట్స్..!

-

మినిష్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఒక నోటిఫికేషన్ ని జారీ చేసింది. కామన్ ఫార్మాట్ లో పొల్యూషన్ సర్టిఫికెట్ ని దేశమంతటా కూడా సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 కింద జారీ చేయనున్నారు.

పొల్యూషన్

పియుసి సర్టిఫికెట్స్ ని ఐటి-ఎనేబుల్ అమలు అవుతుంది మరియు కలుషితమైన వాహనాలపై కంట్రోల్ కి సహాయ పడుతుందని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. అమలు చేసిన తర్వాత, QR కోడ్ PUC సెంటర్ గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉన్న ఫారమ్‌ లో ముద్రించబడుతుంది.

ఈ డాక్యుమెంట్ పై వెహికిల్ ఓనర్ మొబైల్ నంబర్, పేరు మరియు చిరునామా, ఇంజిన్ నంబర్ వంటి సమాచారాన్ని కలిగి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యక్తిగత సమాచారం అంతా కూడా అక్కడ ఉండదు దానిని రహస్యంగా ఉంచుతారు.

వాహన యజమాని యొక్క డేటాను ప్రొటెక్ట్ చెయ్యడానికి డాక్యుమెంట్ లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. యజమాని మొబైల్ నంబర్ తప్పనిసరి. ఎందుకంటే మెసేజెస్ పంపిస్తారు. అదే విధంగా రిజెక్షన్ స్లిప్ అనేది కూడా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news