స్నేహితురాలికి తుది వీడ్కోలు.. స్నేహం చాటుకున్న కుక్కలు

-

గుజరాత్: స్నేహం.. రక్తసంబంధం లేకుండా దేవుడిచ్చిన వరం. ఈ స్నేహం మనుషుల మధ్యే కాదు.. జంతువులు, పక్షుల మధ్య చిగురిస్తుంది. అలా కుక్కల మధ్య కూడా స్నేహం పుట్టింది. ఏడేళ్ల పాటు కలిసిమెలిసి ఉన్నాయి. ఆడ స్నేహితురాలు చనిపోవడంతో రెండు కుక్కలు తుది వీడ్కోలు సమర్పించి స్నేహాన్ని చాటుకున్నాయి. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది.

చనిపోయిన స్నేహితురాలికి రెండు కుక్కలు ఫైనల్ సెల్యూట్ చేశాయి. జర్మన్ షెపర్డ్ ఆడ కుక్క మీనా 2014 నుంచి వడోదర పోలీసు విభాగంలో పనిచేస్తోంది. ఏడేళ్ల పాటు మీనా సేవలందించింది. దీంతో పాటు మరో రెండు కుక్కలు కూడా ఉన్నాయి. ఈ మూడు కుక్కలు కలిసి చాలా అనుమానిత బాంబు కేసులను ఛేదించాయి.

అయితే కుక్క మీనా అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో రెండు కుక్కులు మీనాకు తుది వీడ్కోలు పలికాయి. సెల్యూట్ చేసి స్నేహం చాటుకున్నాయి. కుక్కలు సెల్యూట్ చేస్తున్న సమయంలో పోలీసులు ఫొటో తీశారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కుక్కల స్నేహంపై నెటిజన్లు ప్రశ్నంసలు కురిపిస్తున్నారు. కుక్కకున్న విశ్వాసం మనిషి ఉండదంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news