కేంద్రం సంచలన నిర్ణయం.. జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం

-

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా  ఒకదేశం-ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర మంత్రి వర్గం ముందుంచింది. తాజాగా కేబినెట్ కు నివేదికను సమర్పించారు.

గతంలో లోక్ సభ ఎన్నికలకు ముందు, తదుపరి ప్రభుత్వం కోసం 100 రోజుల అజెండాను రూపొందించాలని ప్రధాని మోడీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగాలను ఆదేశించారు. రామ్ నాథ్  కోవింద్ నేతృత్వంలో నివేదికను మార్చి 15న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ముఖ్యంగా వనరులను ఆదాచేయడం, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజా స్వామ్య నిర్మాణాన్ని బలంగా చేయడం, దేశ ఆకాంక్షలనుసాకారం చేయడంలో జమిలి ఎన్నికు సహాయపడుతాయని కమిటీ నివేదికలో పేర్కొంది. రామ్ నాథ్ కోవింద్ నివేదికను తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించింది.  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు 100 రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. 

Read more RELATED
Recommended to you

Latest news