టమాటాలు తినడం మానేస్తే.. ధర తగ్గుతుంది : UP మంత్రి ఉచిత సలహా

-

కొంతమంది ప్రజాప్రతినిధులు నోరు జారి వివాదాలు ఎదుర్కొంటారు. తాజాగా ఓ యూపీ మంత్రి కూడా అలా నోరుజారి అప్రతిష్ట పాలయ్యారు. గతంలో ‘ఉల్లిపాయలు తినకండి. మా ఇంట్లో వాటిని వాడటం లేదు. తినడం మానేస్తేనే ధరలు కిందికి దిగి వస్తాయి’ అంటూ ఉల్లి ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా టమటా ధరల పెరుగుదులపైన యూపీ మంత్రి ప్రతిభ శుక్లా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘టమాటాలు తినడం మానేయండి. వాటిని ఇంట్లోనే పండించుకోండి. టమాటాల బదులుగా నిమ్మకాయలను వాడుకోవచ్చు. అందరూ టమాటాలు తినడం మానేస్తేనే వాటి ధరలు దిగివస్తాయి’ అని ఉచిత సలహాలు ఇచ్చారు. బాధ్యత గల హోదాలో ఉన్న మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

మంత్రి వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలు.. ఇటు సామాన్యులు ఫైర్ అవుతున్నారు. బియ్యం ధరలు పెరిగితే ‘భోజనం చేయడం మానేయండి. బియ్యం ధరలు కిందకి దిగి వస్తాయి’ అని బీజేపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తారేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news