గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు యూపీఐ, రూపే సేవలు ఉచితంగానే..!

-

కేంద్రం చిన్న వర్తకులకు గుడ్ న్యూస్ ని చెప్పింది. దేశీయ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ మరియు రూపేలు ఇంకో ఏడాది పాటు చిన్న వ్యాపారులకు, దుకాణదారులకు ఫ్రీగా ఇవ్వనున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆర్థిక సంవత్సరం 2023లో డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని కేంద్రం అనుకుంటోంది. దీనితో చిన్న వర్తకులకు మరో ఏడాది పాటు ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పింది కేంద్రం.

 

upi

ఇది ఇలా ఉండగా గత సంవత్సరం బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం యూపీఐ, రూపే మర్చెంట్ లావాదేవీలపై బ్యాంకులకు జీరో ఫీజుల విషయంలో పరిహారం ఇచ్చింది. మర్చెంట్ డిస్కౌంట్ రేటు అనేది డిజిటిల్ పేమెంట్స్ ని ఇస్తున్నందుకు బ్యాంక్స్ కి చెల్లించే చార్జీలు. దుకాణదారులు వీటిని బ్యాంకులకు చెల్లించాల్సి వుంది.

కానీ ఈ చెల్లింపులను ఇచ్చే ఫిన్‌టెక్ కంపెనీలకి మాత్రం ఎలాంటి ఆదాయం ఉండదు. కేవలం వారు ఫ్రీగా అందించి ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ స్వీకరణను పెంచేందుకు ఈ ఇండస్ట్రీకి ఆర్థిక మద్దతును ఇస్తుంది. జీరో ఎండీఆర్ వల్ల చిన్న వ్యాపారులకు, కిరాణా దుకాణదారులకు కూడా ప్లస్ అవుతుంది. పైగా డబ్బులు చెల్లించుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రిటైల్ చెయిన్ల కంటే ఎక్కువగా చిన్న దుకాణదారులకు జీరో ఎండీఆర్ ఛార్జీలు బెనిఫిట్ గా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news