అల్లుఅర్జున్​-హరీశ్​ శంకర్ కాంబోలో మరో సినిమా !

-

బన్నీ ఇటీవలే నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్‌ 17 వ తేదీన విడుదలై… రికార్డులు కొల్లగొడుతోంది. బన్నీ… సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చింది ఈ పుష్ఫ సినిమా. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇది ఇలా ఉండగా… ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ – దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో మరో సినిమా రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది.

తాజాగా… హరీష్‌ శంకర్‌ చేసిన ట్వీట్‌ చూస్తే.. ఇది అర్థమవుతుంది. వీరిద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేశారు హరీష్‌ శంకర్‌. ”మనం కలిసినప్పుడల్లా ఎంతో సరదాగా ఉంటుంది. నీతో కలిసి సమయాన్ని గడపటం గొప్పగాఉంది. లవ్‌ యూ. తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి” అంటూ హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో సినిమా చేయడమే కోసమే బన్నీ – హరీష్‌ శంకర్‌ కలిశారని అభిమానులు ఆశిస్తున్నారు. హరీష్‌ స్క్పిప్ట్‌ సిద్ధం చేస్తున్నాడని సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news