టాలీవుడ్‌ దర్శకులపై RGV ట్రోలింగ్..బిగ్‌ బాస్‌ బ్యూటీతో కలిసి !

-

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌ లో ఏదో ఓ ట్వీట్‌ చేస్తు… అందరికీ షాక్‌ ఇస్తుంటారు. అయితే… తాజాగా ఆ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… టాలీవుడ్‌ దర్శకులను టార్గెట్‌ చేస్తూ.. ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్లపై సెటైర్లు వేస్తూ.. ఓ ఫోటోను తన ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. టాలీవుడ్‌ టాప్‌ దర్శకులు ఇప్పటి వరకు తీసిన సినిమాలకు తగ్గట్టుగా వారికి కొత్త పేర్లు పెట్టారు వర్మ.

రాజమౌళికి హిస్టరీ దర్శకుడని… త్రివిక్రమ్‌ కు తెలుగు టీచర్ అని.. అలాగే.. పూరి జగన్నాథ్‌ కు కెమిస్ట్రీ టీజర్‌ అంటూ పేర్లు పెట్టారు వర్మ. సుకుమార్‌ కు లెక్కల మాస్టారని.. బోయపాటి శ్రీను కు ఫిజికల్‌ టీజర్‌ అంటూ పేర్లు పెట్టారు వర్మ. వారందరికీ పేర్లు పెట్టడమే కాకుండా… తన సినిమాలను బట్టి తనకు తాను ఓ బిరుదు ఇచ్చేసుకున్నారు ఆర్జీవీ. తాను బయోలజీ టీజర్ ను అంటూ.. బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా తో కలిసి జిమ్‌ చేసిన పిక్‌ ను రిలీజ్‌ చేశాడు వర్మ. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news