మణిపుర్ అల్లర్లు.. భారత్‌ అడిగితే సాయానికి సిద్ధమేనన్న అమెరికా

-

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ రణరంగంలా మారిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాఠశాలలు తిరిగి తెరిచిన మరుసటి రోజే ఓ పాఠశాల బయట గుర్తుతెలియని మహిళను అతిదారుణంగా కాల్చి చంపారు. ఈ తరహా ఘటనలపై భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టి స్పందించింది.

‘మణిపుర్‌ ఆందోళనలు వ్యూహాత్మకమైనవని నేను అనుకోవడం లేదు. దీని వెనక మానవీయ కారణాలున్నాయని భావిస్తున్నాను. హింసాత్మక ఘటనల్లో మహిళలు, చిన్నారులు మృతి చెందుతున్నప్పుడు.. వాటి గురించి స్పందించడానికి భారతీయుడినే కావాల్సిన అవసరం లేదు. మీరు కోరితే.. మేం అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది భారత్‌కు చెందిన అంశమని మాకు తెలుసు. మణిపుర్‌లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం’ అని గార్సెట్టి అన్నారు.

దీనిపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఒక అమెరికా రాయబారి భారత అంతర్గత వ్యవహారాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తానెప్పుడూ వినలేదని పార్టీ సీనియర్ నేత మనీశ్‌ తివారీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version