అందరి చూపు.. ఫిబ్రవరి 1 వైపు.. ఎందుకో తెలుసా..?

కోవిడ్‌–19 నేపథ్యంలో ఫిబ్రవరి 1న సమర్పించే 3వ బడ్జెట్‌ ఎన్నడూ లేని విధంగా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్‌ పేర్కొనడంతో దేశ ప్రజల చూపంతా ఆ ఫ్రిబవరి 1పైనే ఉంది. భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియి ఆర్థిక వి«ధానం భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా పలు అంశాలపై సు«ధీర్ఘమైన సూచనలు, సలహాలు పొందింది. 2021–22 బడ్జెట్‌ను సిద్ధం చేసేందుకు డిసెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, దేశ నిపుణుల, ప్రముఖ ఆర్థిక వేత్తలతో సంప్రదింపులు జరిపారు. పన్నుల విధానంతో పాటు ఆర్థిక రంగ పెట్టుబడుల్లో అత్యంత కీలక పాత్ర వహించే వాటాదారులు పలు సూచనలు చేశారు.

రెండింతలు వృద్ధిపై..

ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, బాండ్లు, బీమా మార్కెట్‌ షేర్లు, ప్రజాపంపిణీ వ్యవస్థ, పారిశుద్ధ్యం రక్షణ సులభతరం చేయడం. పలు ఉత్పత్తులకు అనుసంధాన పెట్టుబడులు, స్వదేశీ ఉత్పత్తులు, నూతన ఆవిష్కరణలు, ఇంధనాలు, పారిశ్రమాలు తదితర విషయాలపై సంబం«ధిత నిపుణులు, యాజమన్యాల బృందాల నుంచి మంత్రిత్వ శాఖ సలహాలు చూచనలు తీసుకుంది.2022 ఆర్థిక బడ్జెట్, వృద్ధిలో కీలకపాత్ర వహించే మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని కేంద్ర మంత్రి సీతారామన్‌ స్పష్టం చేశారు. గత బడ్జెట్‌లో చాలా మంది ఆర్థిక వేత్తలు ఆర్థిక వ్యవస్థను7–9% కుదించవచ్చని అంచనాలు వేసినా ఆ తర్వాత తక్కువ సమంలోనే రెండింతలు వృద్ధి చేయాలని దేశ ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది.