న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

-

ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీఎం ల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే…ఈ సదస్సు లో సీజేఐ జస్టిస్‌ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని న్యాయ మూర్తులు విధి నిర్వహణలోతమ పరమితులను గుర్తుంచుకోవాలని సూచనలు చేశారు సీజేఐ జస్టిస్‌. లక్ష్మణ రేఖను దాటొద్దని కోరారు.. శాసన, కార్య నిర్వాహక, న్యాయ శాఖలకు రాజ్యాంగం వేరు వేరు అధికారాలను కల్పించిందని గుర్తు చేసారు సీజేఐ జస్టిస్‌.

ప్రజా స్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్య కలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదన తో చెప్పారు సీజేఐ జస్టిస్‌. కాగా..ఆరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వీ రమణ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news