అంతరిక్షంలో తడి టవల్ పిండితే ఏమైవుతుందో తెలుసా.?

-

అంతరిక్షం అంటే.. అందరికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఇప్పుడంటే..టెక్నాలజీ విపరీతంగా పెరిగింది కాబట్టి.. పైన ఎలా ఉంటుంది ఏంటి మనకు కాస్త అవగాహన ఉంది. మొదట్లే.. అసలు అక్కడ ఎలా ఉంటారు, ఏం తింటారు, మనం తినేవి దొరుకుతాయా, దొరకవా, స్నానం చేస్తారా, వాటర్ ఉంటుందా వామ్మో బోలెడ్ డౌట్స్ వచ్చేవి కదా.. అంతరిక్షం గురించి మనం చిన్నప్పుడు ఎంతోకొంత చదివే ఉంటాం.. కానీ అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. మనకు తెలియనని చాలా ఉంటాయి. దాంతో వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవక మానరు. ఈరోజు అంతరిక్షంలో తడి టవల్ పిండితే ఏమైవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station – ISS)లోని వ్యోమగాములు… రోదసిలో ధర్మాలను వీడియోల రూపంలో అప్పుడప్పుడు వివరిస్తుంటారు. వాళ్లు తినే ఆహారం, తాగే నీరు, వేసుకునే మందులు, వాడే వస్తువులకు సంబంధించి వీడియోలు చేస్తుంటారు. అందులో భాగంగానే కెనడా స్పేస్ ఏజెన్సీ (CSA)కి చెందిన వ్యోమగామి తడి టవల్‌ని అంతరిక్షంలో పిండితే ఎలా ఉంటుందో వివరించారు.

ఆస్ట్రోనాట్ కమాండర్ క్రిస్ హాడ్‌ఫీల్డ్… ఓ తడి టవల్‌ని పిండిన పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. మనం బట్టలు ఉతికాక.. ఎలాగైతే.. పిండుతామో.. అక్కడ కూడా అలా కూడా ఓ క్లాత్ ను పిండారు. కానీ నీళ్లు కిందకు రాలేదు. ఓ ట్యూబ్‌లా ఏర్పడి ఎటూ వెళ్లకుండా ఉంది. రోదసిలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్లే నీళ్లు కింద పడలేదు.

స్పేస్ స్టేషన్‌లో పనిచేసే వ్యోమగాములకు మన ఇళ్లలో వాడే టవల్స్ వంటివి ఇవ్వరు. వారికి ప్రతీదీ ప్యాక్ చేసి… వీలైనంత చిన్నగా ఉండేవి ఇస్తారు. తినే ఆహారం, తాగే నీరు అన్నీ ప్యాకెట్ల రూపంలోనే లభిస్తాయి. వాళ్లు వాడే టవల్ ఎలా ఉంటుందో… 2013లోనే యూట్యూబ్‌లోని ఓ వీడియోలో వివరించారు క్రిస్ హాడ్‌ఫీల్డ్.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news