ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..!

-

ఇది ఒక కొత్త వింత‌, ఒక పాత రోత అని దేనికైనా ఊరికే అన్నారా..? ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త త‌ర‌హాలో ఆలోచిస్తున్న‌ది యూత్‌. యూత్ త‌మ పెళ్లి విష‌యంలోనూ పెళ్లి కార్డు నుంచి పెళ్లి వేదిక ఇత‌ర కార్య‌క్ర‌మాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని య‌శ్‌పూర్ జిల్లా ఫ‌ర్‌స‌భ స‌మితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ వారి పెళ్లి సంద‌ర్భంగా వెడ్డింగ్ కార్డు రూపొందించిన విధానం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

ఆ పెళ్లి కొడుకు చూడ‌గానే ఆధార్ కార్డులా క‌నిపించే విధంగా త‌న పెళ్లి కార్డును ప్రింట్ చేయించి బంధువులు, మిత్రుల‌కు పంచాడు. త‌మ పెళ్లికి విచ్చేసే వారంద‌రూ ముఖానికి త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని భౌతిక దూరం పాటించాల‌ని ఆకార్డులో పేర్కొన్నాడు. బార్ కోడ్ సైతం క‌లిగి ఉన్న ఈ కార్డులో ఆధార్ నెంబ‌ర్ స్థానంలో పెళ్లి తేదీ ఆ కింద అడ్ర‌స్ స్థానంలో ఆచ‌రించాల్సిన కొవిడ్ నియ‌మాలు పొందుప‌రిచాడు. ఇక ఏదైనా కొత్త‌గా క‌నిపిస్తే ఇట్టే వైర‌ల్ చేసే నెటిజ‌న్లు ఊరుకుంటారా.? ఇప్పుడు ఆ ఆధార్ కార్డును అదే ఆధార్ కార్డును పోలి ఉన్న వెడ్డింగ్ కార్డును తెగ వైర‌ల్ చేస్తూ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news