మోడీ ఏం మాట్లాడతారు…?

-

కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలకు ఆదరణ పెరిగింది. జనతా కర్ఫ్యూ నుంచి నేటి వరకు ఆయన ఇచ్చే సందేశం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ ని మే 17 వరకు పెంచుతూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. నిన్న సాయంత్రం కేంద్ర హోం శాఖ దీనిపై ప్రకటన చేసింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడి జాతిని ఉద్దేశించి నేడు ఉదయం 10 గంటలకు మాట్లాడతారు.

ఇప్పుడు ఆయన నోటి నుంచి ఏం వస్తాయో అనే ఉత్కంట అందరిలో ఉంది. ఆయన చెప్పే మాటలపైనే దేశ౦ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. వలస కార్మికుల నుంచి ఐటి ఉద్యోగుల వరకు అందరూ కూడా ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మోడీ కీలకంగా ఐటి, ఫార్మా గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని, లాక్ డౌన్ విషయంలో కొన్ని కీలక విషయాలను ఆయన చెప్పే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

మే 4 నుంచి 17 వరకు రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే దేశ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాలను కేంద్రం ప్రకటించింది. ఏపీలో ఐదు రెడ్‌జోన్లు, ఏడు ఆరెంజ్, ఒకటి గ్రీన్‌జోన్‌, తెలంగాణలో ఆరు రెడ్‌జోన్లు, 18 ఆరెంజ్ జోన్లు, 9 గ్రీన్‌జోన్లు, దేశ వ్యాప్తంగా 130 రెడ్‌జోన్లు, 284 ఆరెంజ్‌జోన్లు, 319 గ్రీన్‌జోన్‌లు ఉన్నాయని కేంద్రం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news