గుడికి వైసీపీ రంగులు, కొత్త వివాదం…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రంగుల పై వివాదం తీవ్ర స్థాయిలో చెలరేగింది. ఆ భవనం ఈ భవనం అనే తేడా లేకుండా రంగులు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది మంచి పద్ధతి కాదని రంగులు తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేసినా సరే జగన్ సర్కార్ మాత్రం మారలేదు. ఇక ఈ విషయంలో హైకోర్ట్ ఏపీ సర్కార్ కి పెద్ద షాక్ ఇచ్చింది.

రంగులను తొలగించాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చినా సరే వైసీపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది. ఆ వివాదం పూర్తి కాక ముందే తాజాగా మరోసారి వైసీపీ రంగులు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఓ శివాలయం ప్రాంగణంలో ఉన్న భవనానికి వైసీపీ రంగులు వేసారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం చుక్కావారిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శ్రీ అర్ధనారీశ్వరాలయ ప్రాంగణంలో ఒక చిన్న కార్యాలయం ఉండగా…

ఆ కార్యాలయానికి వైసీపీకి సంబంధించిన రంగులు వేసారు. వేదగిరివారిపల్లి గుండ్లపల్లి పంచాయతీలతోపాటు దామలచెరువు గ్రామాల ప్రజలు ఇక్కడి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. గర్భాలయానికి అనుబంధంగా ఓ దాత నిర్మించి ఇచ్చిన గదికి స్థానిక వైసీపీ నేతలు రెండు రోజుల క్రితం రంగులు వేయడం… దీన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చడం జరిగింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news