Whats APP : వాట్సాప్‌ లోనూ “నియర్‌ షేర్‌ ఫీచర్‌”..ఎలా వాడాలంటే ?

-

రోజుకో ఫీచర్​తో వాట్సాప్ సంస్థ యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. వాట్సాప్‌ రోజుకో ఫీచర్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రపంచంలో వాట్సాప్ యూజర్లు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. యూజర్ల సంఖ్య మరింత పెంచేందు.. ఇప్పటికే ఉన్న యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకొస్తోంది.

WhatsApp is working on an in-app Nearby File Sharing Feature

తాజాగా వాట్సాప్ అదిరిపోయే ఫీచర్ ను తీసుకురానుంది. నియర్ బై షేర్, ఎయిర్ డ్రాప్ తరహాలో ఇంటర్నెట్ తో పని లేకుండా ఫైల్స్ బదిలీ చేసుకునే ఆప్షన్ తేనుంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉన్నట్లు ఆ కంపెనీ తెలిపింది. పీపుల్ నియర్ బై పేరుతో దీనిని పరిచయం చేయనుంది. యాప్ ఓపెన్ చేసి డివైజ్ ను కదిపితే షేర్ రిక్వెస్ట్ వెళ్తుంది. రిసీవర్ యాక్సెప్ట్ చేయగానే ఫైల్స్ షేర్ అవుతాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news