గత ఆదివారం రాత్రి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బీహార్, పశ్చిమబెంగాల్ లో అల్లర్లు, హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. రిష్రా లో శ్రీరామనవమి శోభాయాత్రలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, బిజెపి ఎమ్మెల్యే భీమన్ ఘోష్ పాల్గొన్నారు. ఈ ఘర్షణల్లో ఎమ్మెల్యే భీమన్ గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెరంగపూర్ లో కూడా ఘర్షణలు చెలరేగాయి. ఈ ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
అయితే ఈ అల్లర్లు, హింసకాండ వెనుక బిజెపి కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు శివసేన నేత సంజయ్ రౌత్. బిజెపి ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడే అల్లర్లు జరుగుతాయని అన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారని.. ప్రస్తుతం కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అంతవరకు ఆగడం ఎందుకని నిలదీశారు.