ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ట్విస్ట్‌

-

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని ఆమె చెప్పినట్లు జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడించింది. దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ సిట్ పనితీరును తప్పుబట్టారు.

సిట్ అధికారులు ఆ మహిళలను బెదిరించారని కుమారస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే.. వ్యభిచారం కేసు నమోదు చేస్తామని భయపెట్టినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. కిడ్నాప్‌నకు గురైన మహిళను ఎక్కడ ఉంచారు..? ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు..? అని ప్రశ్నించారు. కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ.. జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సిట్ దర్యాప్తు నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news