రెజ్లర్ల సంచలన నిర్ణయం..పతకాలు గంగా నదిలో పడేస్తాం

-

మేం సాధించిన పథకాలు గంగా నదిలో పడేస్తామని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజర్లు ప్రకటించారు. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం రోజునే రెజ్లర్ల ఆందోళనను పోలీసులు అణిచివేసిన సంగతి తెలిసిందే.

Wrestlers protest

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంట్‌ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మహిళా రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్న తీరు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

అయితే.. తాజాగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజర్లు సంచలన నిర్నయం తీసుకున్నారు. మేం సాధించిన పథకాలు గంగా నదిలో పడేస్తామని రెజర్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం హరిద్వార్ లోని గంగలో మా పతకాలు పడేస్తామని వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news