ఢిల్లీలో పురాతన ఖిల్లా ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

ఢిల్లీలో పురాతన ఖిల్లా ను సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. దేశ రాజధాని ఢిల్లీలో పురానా ఖిల్లా కు ప్రత్యేకత ఉందని వెల్లడించారు. గత చరిత్ర ఆధారాలు పురాణ ఖిల్లా వద్ద లభిస్తున్నాయి..అనేక యుగాల వ్యక్తుల ఆనవాళ్లు పురాణ ఖిల్లా లో లభ్యం అవుతున్నాయని పేర్కొన్నారు.

పురాణ ఖిల్లా పై పాండవులు కూడా సంచరించారు… మహాభారతం లోని ఇంద్ర ప్రస్త గ్రామమే నేటి ఢిల్లీ అని చెప్పుకొచ్చారు కిషన్‌ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో 9 లేయర్లు భయట పడ్డాయి… దేశ వ్యాప్తంగా జరుగుతున్న తవ్వకాల్లో పురాణ ఖిల్లా తవ్వకాలు చాలా ముఖ్యమైనవి అని అన్నారు.

అనేక కాలాల ప్రజలు ఇక్కడ జీవించారు… ప్రస్తుత త్రవ్వకాలలో దేవతా విగ్రహాలు,130 కాయిన్స్ బయట పడ్డాయని స్పష్టం చేశారు. తవ్వకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి… పురాతన చరిత్రకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయన్నారు. మహాభారతం నాటి ఆనవాళ్లు, 2500 ఏళ్ల క్రితం ఆనవాళ్లు లభిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news