యుట్యూబ్ చానల్స్ ఇంత వరస్ట్ గా ఉన్నాయా…? వ్యూస్ కోసం మహిళను ఏం అడిగారంటే

-

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చానల్స్ వ్యూస్ కోసం దిగజారే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. తాజాగా ‘చెన్నై టాక్స్’ అనే యుట్యూబ్ ఛానల్ మరింతగా దిగజారింది. తమిళ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను గ్రేటర్ చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళను సెక్స్ గురించి స్పష్టమైన వివరాలతో వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసారు. ఆ మహిళ కూడా ఆ వివరాలు చెప్పింది.

హోస్ట్ దాని గురించి నవ్వడం వీడియోలో కనపడింది. అయితే… వీడియోలో కనిపించిన మహిళ షో స్క్రిప్ట్ అని… వీడియోలో వ్యాఖ్యలను నిలిపివేస్తామని ఛానెల్ తనకు హామీ ఇచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొంది. కాని ఇతర యూట్యూబ్ ఛానెళ్లలో వీడియోను చూసి తాను షాక్ అయ్యానని పేర్కొంది. సెక్స్, లైంగిక మరియు సంబంధాలపై ఆమె తేలికపాటి సంభాషణలో పాల్గొంది.

వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో కూడా ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఛానెల్ యజమాని అయిన దినేష్, వీజే అసెన్ బాద్షా, వీడియో జర్నలిస్ట్ అజయ్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగంగా అశ్లీలంగా మాట్లాడటం… లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టు చేశారు. బసంత్ నగర్ బీచ్ వద్ద వీళ్ళు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని శాస్త్రి నగర్ పోలీసులు పేర్కొన్నారు. అక్కడ వారు వీడియోల కోసం ప్రజలను అసౌకర్య ప్రశ్నలు అడుగుతున్నారు. పోలీసులు వారి కెమెరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐపిసి సెక్షన్లు 354 (బి), 294 (బి), 509, 506 (ii), తమిళనాడు మహిళా వేధింపుల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news