హైదరాబాదులో ఈ మధ్య కాలంలో వరుసగా భూ ప్రకంపనలు టెన్షన్ పెడుతున్నాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న బోరబండలో భూ ప్రకంపనలు రావడంతో ఏకంగా రెండు మూడు రాత్రుల పాటు ప్రజలంతా రోడ్ల మీద నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా కూకట్ పల్లిలో కూడా భూమి కంపించినట్టయింది. పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టయిందని అక్కడి స్థానికుల నుండి అందుతున్న సమాచారం.
ఈ భూ ప్రకంపనలు కారణంగా స్థానికులు భయాందోళనలతో ఇళ్లలో నుంచి రోడ్డు మీదకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ మధ్య కాలంలో గచ్చిబౌలిలో కూడా ఇలానే భూప్రకంపనలు వచ్చాయి. భూమిలో నీరు చేరుతున్న సమయంలో కూడా ఇలా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందని అప్పుడు భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే తాజాగా కూకట్ పల్లిలో కూడా ప్రకంపనలు రావడం కాస్త సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది.