మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం..!

-

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచనలు జారీచేసింది. గర్భిణీలకు జికా వైరస్ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలను ఆదేశించింది. గర్భిణీలు పాజిటివ్ గా తేలిన వారిని నిత్యం పర్యవేక్షించాలని పేర్కొంది. పిండాల పెరుగుదలను పర్యవేక్షిస్తూ.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.

నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆస్పత్రి ప్రాంతాల్లో దోమలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. జికా వైరస్ పై అపోహలు, భయాందోళను పోగొట్టేందుకు సోషల్ మీడియా సహా ఇతర ప్లాట్ ఫాంల ద్వారా వైరస్ పై అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఏదైనా కేసుని గుర్తిస్తే వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రోగ్రామ్ (ఎల్డీఎస్పీ), నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్సీవీబీజీసీ)కి నివేదించాలని రాష్ట్రాలకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news