తానా మాజీ అధ్యక్షుడు మృతి..!!!

-

అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలుగు సంఘం తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) కి విశిష్ట సేవలు అందించిన మాజీ అధ్యక్షుడు డాక్టర్. నవనీత కృష్ణ నిన్నటి రోజున అకాల మరణం చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల తానా సభ్యులు అందరూ సంతాపం తెలియచేశారు. అమెరికాలో వైద్యుడిగా విశేష సేవలు అందించిన నవనీత కృష్ణ ని చూడటానికి ఆయనతో పనిచేసిన ఎంతో మంది వైద్యులు విచ్చేశారు.

తానా మాజీ అధ్యక్షుడు నవనీతకృష్ణ మృతి - పలువురి సంతాపం

ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ సామాన్య రైతు కుటుంభంలో జన్మించిన ఆయన చదువుల్లో రాణించి ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో డాక్టర్ గా స్థిరపడ్డారు.ఆ తరువాత తాను పుట్టిన జన్మభూమి ఋణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో అమెరికన్ ఇన్స్తిటూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.

 

అమెరికాలో తానా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతో మంది తెలుగు వారికి సేవలు అందించారు. సొంత రాష్ట్రంలోని తన స్వగ్రామంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికి చేరువ అయ్యారు. ఒక్క సారిగా నవనీత్ కృష్ణ మృతి చెందారనే వార్త తెలియడంతో సొంత గ్రామ ప్రజలు విషాదంలో నిండిపోయారు. పలువురు ఆయన మృతిపట్ల సతాపం తెలిపారు.  అయితే ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఓ ఫ్యునరల్ హోమ్ లో మధ్యాహ్నం 2 నుంచీ 4 గంటల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టుగా కుటుంభ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news