మిస్సింగ్ సీఆర్పీఎఫ్ జవాన్ కూతురు విజ్ఞప్తి…వీడియో రిలీజ్ చేయడానికి సిద్దమయిన నక్సల్స్ ?

-

ఛత్తీస్‌గడ్ లో ఏప్రిల్ 3 న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పిపోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కమాండో తమ అదుపులో ఉందని నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) నిన్న ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిని ప్రకటిస్తే అప్పుడే వారు సిఆర్‌పిఎఫ్ కమాండోను మధ్యవర్తికి విడుదల చేస్తామని తెలిపింది. స్థానిక జర్నలిస్ట్ గణేష్ మిశ్రా మాట్లాడుతూ “ఇటీవల, రాకేశ్వర్ సింగ్ మాన్హాస్ కుమార్తె తన తండ్రిని సురక్షితంగా అధికారులకు అప్పగించాలని మావోయిస్టులను అభ్యర్థిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది, దానికి సమాధానంగా మావోయిస్టులు త్వరలో జవాన్ యొక్క వీడియో సందేశాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.” అని పేర్కొన్నారు.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వారు రెండు రోజుల్లో జవాన్‌ను విడుదల చేస్తారు” అని తనకు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. ”ఒక జవాన్ వారి అదుపులో ఉన్నట్లు నాకు నక్సల్స్ నుండి రెండు కాల్స్ వచ్చాయి, జవాన్‌కు బుల్లెట్ గాయం అయిందని, వైద్య చికిత్స అందించారని, అతను 2 రోజుల్లో విడుదల అవుతాడని వారు తెలిపారు అని అన్నారు. అలానే జవాన్ యొక్క వీడియో & ఫోటోను త్వరలో విడుదల చేయనున్నట్లు వారు తెలిపారని ఆయన పేర్కొన్నాడు.  

Read more RELATED
Recommended to you

Latest news