SBI: ఈ ఎనిమిది సర్వీసులని ఇంట్లో వుండే పొందొచ్చు…!

-

ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ నుండి అనేక ఫెసిలిటీస్ ని పొందవచ్చు. ఎస్బిఐ కస్టమర్ తమ అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫర్ ఫండ్స్, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టడం, డెబిట్ కార్డ్ కోసం అప్లై చేయడం ఇలా వివిధ రకాల సర్వీసులు ఆన్లైన్లోనే పొందొచ్చు. అలానే ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆన్లైన్లోనే చేయొచ్చు. కేవలం యూజర్ ఐడి మరియు లాగిన్ పాస్వర్డ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ పొందొచ్చు. తాజాగా ఎస్బిఐ ట్విటర్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి పలు విషయాలు చెప్పింది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఇలా మొదలు పెట్టండి:

ముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం బ్యాంకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే దీనిని చేసేయొచ్చు.

ముందుగా onlinesbi.com, హోమ్ పేజ్ కి వెళ్లి ఓపెన్ చేయండి.
ఇప్పుడు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లేదా ఆక్టివేషన్ మీద క్లిక్ చేయండి.
ఎకౌంట్ నెంబర్, సిఐఎఫ్ నెంబర్, బ్రాంచ్ కోడ్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది.
ఇప్పుడు ఏటీఎం కార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏటీఎం లేకపోతే మిగిలిన వివరాలను ఇవ్వండి.
ఇప్పుడు మీరు యూజర్ నేమ్ మరియు లాగిన్ పాస్వర్డ్ ఒక దగ్గర నోట్ చేసుకోండి.
తిరిగి మళ్లీ దానిని ఎంటర్ చేయవలసి వస్తుంది. వాటిని ఎంటర్ చేసాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యి మీరు ఇందాక నోట్ చేసుకున్న యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ అఫ్ బర్త్, ప్లేస్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్ లాంటివి ఇప్పుడు అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేసి చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.

ఒకవేళ మీరు రిజిస్టర్ అయిపోయి పాస్వర్డ్ మర్చిపోతే ఇలా చేయండి:

www.onlinesbi.com.ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి forget లాగిన్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు యూజర్ నేమ్, ఎకౌంట్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ వస్తాయి ఫిల్ చేయండి.
ఇప్పుడు ఓటిపి మీ మొబైల్ నెంబర్ కి వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మూడు ఆప్షన్లు ఉంటాయి మీరు లాగిన్ అవ్వడానికి.
ఇలా ఇప్పుడు లాగిన్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి

Read more RELATED
Recommended to you

Latest news