“గాడ్ ఫాదర్” నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు మేకర్స్. ఈ టీజర్ లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు.

ఇదిలా ఉంటే తాజాగా.. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతిి తెలిసిందే. అయితే నయనతార ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ చిత్రంలో నయన్ ” సత్యప్రియ జై దేవ్” గా పరిచయం చేశారు. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ లో మరో స్టార్ హీరోని ఈవెంట్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news