ఆనందం కోసం తల్లిదండ్రులం అయ్యామని సోషల్ మీడియాలో పెడితే అది పాములాగా మెడకు చుట్టుకున్నట్టు అయ్యిందని హీరోయిన్ నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెగ కంగారు పడుతున్నారట. ఈ దంపతులు ఇటీవల తమకు కవల పిల్లలు పుట్టారని చెబుతూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.అక్కడే అసలు ట్విస్టు మొదలయ్యింది.పెళ్ళైన నాలుగు నెలలకే కవల పిల్లలు పుట్టారంటే,అది సరోగసీ ద్వారానే పుట్టినట్లు స్పష్టం అయింది. అయితే సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మ నివ్వడం నిబంధనలకు అనుగుణంగా వుండాలి. ఈ సందర్భంగా నయనతార దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఈ సరోగసి చట్ట బద్ధంగానే జరిగిందా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం తమిళనాడు సర్కారు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నయనతార – విఘ్నేష్ శివన్ లను మరికొన్ని రోజులలో విచారణ చేయనున్నారని తెలుస్తోంది. దీనితో నయనతార – విఘ్నేష్ శివన్ లలో భయం మొదలయ్యిందట.ఒకవేళ సరోగసి నిబంధనల ప్రకారం లేదని తేలితే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష మరియు రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అంటున్నారు.
దీంతో టెన్షన్ పడుతున్న నయనతార – విగ్నేష్ దంపతులు ప్రముఖ లాయర్లను కలసి తమను కేస్ లేకుండా బయట పడేయాలని కోరుతున్నారట. ఇందులో భాగంగా కమిటీకి ఎలా సమధానం చెప్పాలి, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ఎలా కన్విన్స్ చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. దత్తత తీసుకున్నాము అని చెప్పినా కూడా దత్తత కోసం ముందుగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లాయర్లు చెప్పారట. ఇలా దీని నుండి బయటకి రావడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారట. పాపం పిల్లలు పుట్టారన్న ఆనందం నయనతార – విగ్నేష్ వారం రోజులకే ఆవిరి అయిపోయింది.