బికినీలో కనిపించనున్న నయనతార.. విలువ ఎంత అంటే..?

-

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ట్రెండ్ మారుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చినట్లుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల విషయంలో ఇతరులు ఏమనుకుంటారో అన్న విషయాలను పక్కనపెట్టి యువతను ఆకట్టుకోవడమే పనిగా తమను తాము మరింత మార్చుకుంటున్నారని చెప్పాలి. మొన్నటి వరకు బికినీలకు దూరంగా ఉన్న భామలు కూడా ఇప్పుడు బికినీలు ధరిస్తూ కోట్లకు కోట్లు పారితోషకం తీసుకుంటూ అందరిని అలరిస్తున్నారు. ఇకపోతే తాజాగా పద్ధతికి చీర కట్టినట్టు ఉండే నయనతార ఇప్పటివరకు గ్లామర్ షో చేయలేదు. ఒకవేళ చేసినా.. కొంత వరకే గ్లామర్ షో చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా బికినీ షో చేయడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ.

హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఈమె నటిస్తున్న చిత్రం జవాన్ .. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వచ్చిన పోస్ట్ , పోస్టర్స్ మంచి ఆదరణ పొందింది. ఇక ఇందులో ఇతర కీలక పాత్రల్లో దీపికా పదుకొనే, ప్రియమణి , సానియా మల్హోత్ర , సునీల్ గ్రోవర్ తదితరులు కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం.

ఇక జవాన్ చిత్రాన్ని హిందీ తో పాటు తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చే ఏడాది జూన్ రెండవ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నయనతార ఈ సినిమాలో మొదటిసారి బికినీలో కనిపించనుందట.. అయితే వాస్తవానికి సౌత్ లో సినిమాలో నటిస్తే రూ.10 కోట్లు తీసుకునే ఈమె అక్కడ బాలీవుడ్లో అందులోను బికినీలో నటించడానికి సుమారుగా రూ. 15 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news