సంక్రాంతి బరిలో బాలయ్య NBK 107 !

-

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘అఖండ’ విజయం తర్వాత ఆయన ప్రస్తుతం ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 ఫిల్మ్ చేస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుండగా, విలన్ రోల్ ను కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ప్లే చేస్తున్నారు. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. అయితే.. ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసుకుని త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను చేపట్టనున్నారు మేకర్స్. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news