భారత్‌లో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. అలానే మహిళలకు రక్షణ కల్పించడంలో మన దేశం ప్రపంచంలో 133వ ప్లేస్‌లో ఉందట. మహిళలకు, బాలికలకు ఏ రాష్ట్రమూ సురక్షితం కాదని తేల్చింది. 2018తో పోలిస్తే..2019లో మహిళలపై నేరాలు 7.3శాతం పెరిగాయని వెల్లడించింది. అత్యాచార ఘటనల్లో 11శాతం బాధితులు దళిత అమ్మాయిలే అని, ఈ తరహా నేరాల్లో యూపీ అగ్రస్థానంలో ఉందని వివరించింది.
హత్రాస్ ఘటన అనంతరం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ లేటెస్ట్ రిపోర్టు రిలీజ్ చేసింది. అలానే ప్రతి రెండు రోజులకు దాదాపు ఒక బాధితురాలు యాసిడ్ దాడికి గురవుతోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. అంతే కాదు మన దేశంలో ప్రతి 30 గంటలకు ఒక మహిళ గ్యాంగ్ రేప్ కు గురవుతోందని పేర్కొన్నారు. అలానే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 7.3% పెరిగాయని, ప్రతి లక్ష మందిలో 62.4% మంది రేప్‌లు, వేధింపులకు గురవుతున్నారని తేలింది. 2018తో పోలిస్తే చిన్నారులపైనా వేధింపులు, దాడులు 4.5% పెరిగాయి. 1.48 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.