నీట్‌ యూజీ-2024 రీటెస్ట్…. సగం మంది డుమ్మా

-

దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ-2024 పేపర్‌ లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు.నీట్‌ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది.

వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ వెల్లడించింది. 1563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఎన్టీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.ఛత్తీస్‌గఢ్, మేఘాలయ,గుజరాత్, హరియాణాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 7 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు రీటెస్ట్ నిర్వహించారు. చండీగఢ్ నుంచి ఇద్దరు విద్యార్థులూ హాజరుకాలేదు. ఛత్తీస్ గఢ్‌లో 602 మంది విద్యార్థులకుగానూ 311 మంది హాజరుకాలేదు. మేఘాలయలో 466 మందికి 234 మంది ,హరియాణాలో 494 మందికి 287 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version