ఆకట్టుకుంటున్న ‘అహింస’ ‘నీతోనే నీతోనే’ సాంగ్ ప్రోమో

-

ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు, హీరో రానా తమ్ముడు అభిరామ దగ్గుబాటి హీరోగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న సంగత మనకు తెలిసిందే. దర్శకుడు తేజ దర్శకత్వంలో.. అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ నుడు రజత్‌ బేడీ కీలక విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు. . అభిరామ్‌ కు జోడీగా గీతిక తివారీ నటిస్తోంది.

త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ తేదీని అనౌన్స్‌ చేయనున్నారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై జెమిని కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

తేజ పుట్టిన రోజు నేపథ్యంలో.. అభిరామ్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. నీతోనే నీతోనే అంటూ సాగే సాంగ్‌ ప్రమోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఫుల్‌ సాంగ్‌ రేపు రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news