లేడీ చెఫ్స్ తో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిరిగి ప్రారంభం..!

-

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ మొదలుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే కిరాక్ ఆర్పి.. గత కొంతకాలంగా కామెడీ షోలు చేయడమే మానేశాడు. సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్న ఆయన గత నెలలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట హైదరాబాదులో ఒక కర్రీ పాయింట్ కూడా ప్రారంభించాడు. ఆ బిజినెస్ ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో హిట్ అయింది. కర్రీ పాయింట్ కు పెద్ద సంఖ్యలో జనాలు పొటెత్తారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కి కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. దాంతో కర్రీ పాయింట్ ను క్లోజ్ చేశాడు.

డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై ఉండాలన్న ఆలోచనతో నెల్లూరు వెళ్లి అక్కడ చేపల పులుసు పోటీ పెట్టాడు. బాగా రుచికరంగా వండిన కొందరు మహిళలను హైదరాబాదుకు తీసుకొచ్చి తిరిగి కర్రీ పాయింట్ ప్రారంభించాడు. ఇప్పుడు తిరిగి ఓపెన్ చేశాడు. నెల్లూరు నుంచి తీసుకొచ్చిన మహిళలకు ప్రస్తుతానికి తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడు. మహిళలందరూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వంట మొదలు పెడతారని.. నాలుగు గంటల్లో వంట పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. తమ కర్రీ పాయింట్ కి ఇప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు ఆర్ పి.

రెస్టారెంట్ క్లోజ్ చేయకముందు రోజుకు రూ.4 లక్షల ఆదాయం పొందిన ఈయన .. ఇప్పుడు ఎక్కువ మంది స్టాక్ తో మరింత ఆదాయం పొందే దిశగా దూసుకుపోతున్నాడు. కామెడీ షోల కంటే ఇలా సొంతంగా బిజినెస్ పెట్టి మరింత పాపులారిటీ దక్కించుకోవడమే కాకుండా భారీ గా లాభార్జన కూడా పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news