చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఈ టూర్స్ వేసేయండి..!

-

చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చాలా మందికి చల్లగా ఉంటే నచ్చదు వెచ్చగా ఉండడానికి చూస్తూ ఉంటారు. అందుకని చల్లగా ఉండే ప్రదేశాలని కాకుండా వేడిగా ఉండే ప్రదేశాలని ఎంచుకొని వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు.

మీరు కూడా చలికాలంలో ఒక మంచి ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ప్రదేశాలని చూడండి. వీటిలో మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఆనందంగా గడిపి రావచ్చు. ఇక్కడ వాతావరణం వెచ్చగా ఉంటుంది మీరు ఎంజాయ్ చేయడానికి కూడా అవుతుంది మరి ఎటువంటి ప్రదేశాలకు వెళ్లొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

లక్షద్వీప్:

చలి కాలంలో ఇక్కడకి వెళ్తే ఎంతో బాగుంటుంది. ఇక్కడ బీచ్లు చాలా బాగుంటాయి. అందుకే ఎక్కువ మంది వెళ్తూ వుంటారు. జనవరిలో ఇక్కడ బాగుంటుంది కనుక అప్పుడు ప్లాన్ చేసుకోవడం మంచిది. స్కూబా డైవింగ్, కానోయింగ్, బోటింగ్, కయాకింగ్ వంటివి ఇక్కడ ఉంటాయి.

కోవలం:

ఇక్కడకి కూడా మీరు వెళ్ళచ్చు. జనవరి, ఫిబ్రవరి లో ఇక్కడ బాగుంటుంది. చక్కగా వెచ్చగా ఉంటుంది. వాటర్‌స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఆయుర్వేద స్పా సేవలను కూడా మీరు ఇక్కడ పొందవచ్చు.

తమిళనాడు:

తమిళనాడు రాష్ట్రంలోని తీర ప్రాంతాలను కూడా చూసేందుకు బాగుంటాయి. మీరు జనవరి లో ఇక్కడకి వెళ్లి ఎంజాయ్ చేసేయచ్చు.

గోవా:

గోవా కూడా చాలా బాగుంటుంది. జనవరి నెల లో మీరు వెళ్ళచ్చు. చక్కగా ఫ్రెండ్స్ తో మీరు గోవా వెళ్తే ఎంతో హ్యాపీ గా ఉంటుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news