నెల్లూరు: అబ్దుల్ అజీజ్ కు అన్యాయం చేసిన టీడీపీ…

-

గత ఎన్నికల సమయంలో హఠాత్తుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి రాత్రికి రాత్రే టీడీపీ నుండి వైసీపీకి మారడంతో నెల్లూరు రురల్ లో ఎమ్మెల్యే బ్యర్ధి కరువయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో ముస్లిం నేత అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ కు ఆ సీటును కేటాయించారు. కానీ వైసీపీ హోరులో అజీజ్ దారుణంగా ఓటమి పాలయ్యాడు. అనంతరం సిటీ లోనూ ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి నారాయణ కనుమరుగవడంతో, టీడీపీ బాధ్యతలను అబ్దుల్ అజీజ్ కు అప్పగించారు. అప్పటి నుండి పార్టీని ప్రజల్లోకి తీసుకెల్తూ వచ్చాడు అజీజ్. ఇక వచ్చే ఎన్నికలకు కొంతసమయమే ఉన్నందున నెల్లూరు రురల్ సీటును మళ్ళీ ఆశిస్తున్నా అబ్దుల్ అజీజ్ కు అన్యాయం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెల్లూరు రురల్ లో ఈసారి వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సిటీ లో ఎలాగు నారాయణ యాక్టీవ్ అయ్యారు.

నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఇచ్చి నాలుగేళ్లు బాగా వాడుకుని ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా గొంతు కోశారు అని కొందరు టీడీపీని వేలెత్తి చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news