పోలీసులకు కునుకులేకుండా చేసిన దొంగలముఠా అరెస్ట్ !

-

ఎండాకాలం వస్తే చాలా కొన్ని చోట్ల ప్రజలు అంతా బయటపడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఈ సమయాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు దొంగలు విచ్చలవిడిగా చెలరేగి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కు చెందిన దొంగలను వెంకటాచలం పోలీసులు ఈ రోజు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ దొంగలు గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఈ అయిదు మంది దొంగలు దొంగిలించిన నగలు, టీవీలు మరియు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిపోర్ట్ లో పొందుపరిచారు. ఈ సొమ్ము అంతా దాదాపుగా రూ. 11 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు.

ఈ అయిదుగురు దొంగల్లో నాలుగు మాత్రం వెంకటాచలం రురల్ కు చెందినవారుగా గుర్తించగా , మిగిలిన ఒక్కరు మాత్రం నెల్లూరు సిటీ వ్యక్తిగా తెలిపారు. కొన్ని రోజులుగా పోలీసులకు కునుకులేకుండా చేస్తున్న దొంగలను పట్టుకున్నందుకు నెల్లూరు రూరల్ డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి పోలీసులను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news