నరేష్ ,పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లికి ముహూర్తం ఖరారు…!

-

టాలీవుడ్ సీనియర్ నటులైన నరేష్, పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.వివాహం చేసుకోకపోయినా సరే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ జంట. అంతేకాదు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక చావు కైనా పుట్టుకకైనా ఎక్కడికి వెళ్ళినా సరే నరేష్ పవిత్రతో కలిసి వెళ్లడం సరికొత్త అనుమానాలకు దారి తీస్తూ వచ్చింది. ఇకపోతే ఈ ఏడాది తామిద్దరం కొత్త జీవితం ప్రారంభిస్తున్నాము అంటూ ఒక వీడియో రిలీజ్ చేయగా.. నిజంగానే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారేమో అని అందరూ అనుకున్నారు.

కొన్ని రోజులకే సడన్ ట్విస్ట్ ఇస్తూ తమ నెక్స్ట్ సినిమా కోసమే ఈ వీడియో చేశామని స్పష్టం చేశారు. మళ్లీ పెళ్లి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ సీనియర్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా అందులో రమ్య రఘుపతి తో గొడవలు, ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు, అలాగే రమ్య నరేష్ పై చేయించిన దాడులు అన్నింటినీ కూడా తమ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించిన సన్నివేశాలను మనం ఇందులో చూడవచ్చు. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ నరేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ వార్తలు బలంగా వినిపించాయి.

ఇక తెలుగుతోపాటు కన్నడలో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా మళ్లీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈనెల 26వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ఎంఎస్ రాజు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సినిమాలో నరేష్ పవిత్రలతో పాటు జయసుధ ,వనిత విజయ్ కుమార్ , శరత్ బాబు , అనన్య నాగళ్ళ, రోషన్, రవివర్మ, భద్రం, అన్నపూర్ణ, యుక్త, ప్రవీణ్ ఎండమూరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news