తెలంగాణాలో మరో నలభై రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడానికి ఎవరికి వారు వ్యూహాలను రచించుకుంటూ గెలుపు మాదంటే మాదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కానీ ప్రజలు ఎవరిని అయితే ఆశీర్వదిస్తారో వారే సింహాసనం ఎక్కనున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానా రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నల్గొండ లోని గుర్రంపోడు కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ .. తెలంగాణ ప్రజల హృదయాలలో నేను సీఎం కావాలని కోరుకుంటున్నారు, నేను రాజకీయంగా నాకు ఇది కావాలని ఎప్పుడూ కోరుకోలేదు.. నాకు ఎందుకో తెలంగాణకు సీఎం అయ్యే అవకాశం వస్తుందేమో అని అనిపిస్తుంది అంటూ సెల్ఫ్ కామెంట్స్ చేశారు. నాకు ఏ పదవి వచ్చినా కాదనను..
నా సుధీర్ఘమైన 56 ఏళ్ళ రాజకీయ జీవితంలో సీఎం కూడా చేయనన్ని శాఖలను మంత్రిగా పనిచేశానంటూ తన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. మరి ఈయన అనుకుంటున్నట్లు తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డిని కాదని జన రెడ్డికి సీఎం ఇస్తారా ?