పనీపాటా లేని రాజకీయ నిరుద్యోగులకు మైకుదొరికితే చాలు వెనకా ముందూ చూడకుండా మాట్లాడేస్తుంటారు! వారికి పెద్దగా బాధ్యతలు ఉండవు.. జనాలతో వారికి పనిలేదు. జనాలకు వారితో పని లేదు.. కాబట్టి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు! అందులో మొదటిస్థానం కోసం ప్రయత్నిస్తున్నవారిలో తులసీరెడ్డి ఒకరు! ప్రస్తుతం ఈయనకు రాయలసీమ పౌరుషం, సిగ్గూశరం వంటి పదాలు గుర్తుకొచ్చాయి!
తాజాగా మైకందుకున్న తులసీరెడ్డి.. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాజకీయాల్లో తనమనుగడ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జగన్ పై నోరు జారారు! జగన్ కు సిగ్గూశరం ఉంటే… రాయలసీమ పౌరుషం ఉంటే సీఎం పదవి రాజినామా చేయాలని డిమాండ్ చేశారు! జగన్ అంత సిగ్గు పడేలా చేసిన పనేమిటో.. అంత పౌరుషం లేకుండా చేస్తున్న పనులేమిటో తులసీరెడ్డికే తెలియాలి. దీంతో తులసీరెడ్డిని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు!
జగన్ కు సిగ్గూ శరం ఉందికాబట్టే.. ఎవరిపంచనా చేరకుండా సొంతంగా పార్టీ పెట్టుకుని ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, ప్రజల్లో ఉండి అధికారంలోకి వచ్చారు! జగన్ కు పౌరుషం కావాల్సినంత ఉంది కాబట్టే… తనను వద్దనుకున్న సోనియాను తానువద్దనుకుని నిలబడ్డాడు. నేడు సోనియా & కో సైతం “ఔరా జగన్” అనేలా నిలిచాడు.. గెలిచాడు.. “న భూతో న భవిష్యతి” అన్న రీతిలో పరిపాలన సాగిస్తున్నాడు!
మరి ప్రజలు అడ్డంగా తిరస్కరించినా ఇంకా తగుదునమ్మా అంటూ రాజకీయాల్లో ఉన్న తులసీరెడ్డికి సిగ్గూశరం ఉందా? సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్రుల మనోభావాలతో సంబంధం లేకుండా వ్యూహాత్మకంగా కొత్తపాటీ పెట్టి సైడ్ అయిపోయినప్పుడు సీమపౌరుషం ఏమైంది? నిజంగా తులసీరెడ్డికి అంత పౌరుషం ఉంటే… వచ్చే ఎన్నికల్లో వైకాపాపై పోటీచేసి గెలవాలి! లేకపోతే ఆయనకు సిగ్గూ శరం లేదన్నట్లే.. పౌరుషం అనేపదాలు ఆయన దరికి చేరనట్లే! అంతెందుకంటారా… రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచినా చాలంటారా? ఓ..కే..!! అంటు నెటిజన్లు ఫైరవుతున్నారు!!
-CH Raja