ధోని సతీమణి సాక్షి సింగ్ తన ఇన్ స్టాగ్రాం లో పెట్టిన ఓ పోస్ట్ పై నెటిజెన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఐపిఎల్ జరుగుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మోను కుమార్ తో సాక్షి సింగ్ దిగిన ఓ ఫోటోని ఆమె ఇన్ స్ట్గ్రాంలో పెట్టింది. మోను కుమార్ తలపై ముద్దు పెట్టిన పిక్ షేర్ చేసిన సాక్షి సింగ్ బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తుంది.. గడ్డి ఈ సైడ్ పచ్చగా లేదనుకుంటా అంటూ ఓ మెసేజ్ పెట్టింది. మోను కుమార్ బట్టతలపై సెటైరికల్ గా బీ పాజిటివ్ అంటూ సరదాగా పోస్ట్ పెట్టింది.
అయితే ఆమె పెట్టిన ఈ పోస్ట్ పై ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ కొందరు హర్ట్ అయ్యారు. ఇలా మీరు పోస్ట్ పెట్టడం వల్ల మేము బాధపడుతున్నాం మిమ్మల్ని అన్ ఫాలో అవుతున్నామంటూ మెసేజులు పెట్టారు. అయితే మరికొందరు మాత్రం షాట్ పిచ్ బాగుంది బ్యాటింగ్ కు పనికిస్తుందని రిప్లై ఇచ్చారు. మొత్తానికి ధోని భార్యగా సాక్షి సరదాగా పెట్టిన ఓ పిక్ ఇప్పుడు ఆమెను టార్గెట్ చేసేలా అయ్యింది.
View this post on Instagram